Maharashtra: 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్పీకర్‌ను దుర్భాషలాడుతూ, దాడికి యత్నించిన 12మంది ఎమ్మెల్యేలపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, ఘర్షణ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు. కట్టు కథలు అల్లారని ఫైర్ అయిన ఫడ్నవీస్.. బీజేపీ తరఫున ఎవరూ స్పీకర్‌ను దూహించలేదని స్పష్టంచేశారు.
ఈ ఘటనపై అఎంబ్లీ స్పీకర్ జాధవ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు నా క్యాబిన్ దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చూస్తూ.. దూషించారు. ఇదంతా దేవంద్ర ఫడ్నవీస్, సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ఎదురుగానే జరిగింది. కొందరు నాయకులు నా మీద చేయి చేసుకున్నారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాను. దీనిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్‌ని కోరాను అని తెలిపారు.