ప్రభు, సౌందర్య వివాహం చెల్లుతుంది : మద్రాస్ హైకోర్టు

Madras High Court : తమిళనాడులోని AIADMK పార్టీ ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం చెల్లుతుందని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. ప్రభు(36), సౌందర్య(19) ఇద్దరు మేజర్లు కావడంతో వారి వివాహాన్ని తాము అడ్డుకోలేమని కోర్టు వెల్లడించింది

Update: 2020-10-09 07:59 GMT

MLA Prabhu and Soundarya Marriage 

Madras High Court : తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం చెల్లుతుందని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. ప్రభు(36), సౌందర్య(19) ఇద్దరు మేజర్లు కావడంతో వారి వివాహాన్ని తాము అడ్డుకోలేమని కోర్టు వెల్లడించింది. కాగా తన కూతురిని సదరు ఎమ్మెల్యే అపహరించి వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు ఈ రోజు తీర్పును వెల్లడించింది.

దీనికి ముందు తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని, ఇందులో ఎలాంటి బెదిరింపులు, కిడ్నాప్‌లు లేవు అని సౌందర్య ప్రకటించినప్పటికీ ఆమె తండ్రి స్వామినాధన్ మాత్రం పట్టువదలకుండా తన కూతురిని సదరు ఎమ్మెల్యే బలవంతంగా వివాహం చేసుకున్నాడని, రక్షించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాడు. ఈ క్రమంలో ఈ రోజు స్వామినాధన్ కూతురు, ఆమె తండ్రిని వ్యక్తిగతంగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. అనంతరం వాదోపవాదనలు విన్న తర్వాత వారి వివాహం చెల్లుతుందని కోర్టు తీర్పును వెల్లడించింది.

తమిళనాడు లోని కల్లకూరిచి నియోజకవర్గానికి చెందిన ఎఐఎడిఎంకె ఎమ్మెల్యే ప్రభు తియాకతురుగం లోని స్వామినాథన్ కుమార్తె సౌందర్యతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని యువతి ఇంట్లో చెప్పగా అందుకు యువతి తండ్రి స్వామినాధన్ ఒప్పుకోలేదు.. ఇద్దరి మధ్య వయసురిత్యా చాలా తేడా ఉండడం, కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి అయన నిరాకరించారు. అనంతరం కొంతమంది సన్నిహితుల మధ్య ప్రభు, సౌందర్యని అక్టోబర్ 5న వివాహం చేసుకున్నారు. ఇది తట్టుకోలేకపోయిన స్వామినాధన్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News