Low Pressure: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు
Low Pressure: దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
Low Pressure: మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రంలో అల్ప పీడనాలు ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బీహార్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, యూపీ, ఢిల్లీ, కేరళ, కర్నాటక రాష్ట్రాలపై అల్ప పీడనాల ప్రభావం ఉంటుంది.