Criminal Law Bills: మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలకు లోక్‌సభ ఆమోదం

Criminal Law Bills: బ్రిటీష్ హయాం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌ఫీసీ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన మూడు క్రిమినల్ లా బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది.

Update: 2023-12-20 14:08 GMT

Criminal Law Bills: మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలకు లోక్‌సభ ఆమోదం

Criminal Law Bills: బ్రిటీష్ హయాం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌ఫీసీ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన మూడు క్రిమినల్ లా బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటింగ్ ద్వారా బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాజ్యసభలో ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు అమిత్ షా మూడు బిల్లులకు సంబంధించి లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ఈ బిల్లులు న్యాయం చేయడానికి తప్ప శిక్షించడానికి కాదని అమిత్ షా అన్నారు. వేగంగా న్యాయం చేయడానికి ఈ బిల్లులు తీసుకొచ్చామని చెప్పారు. డిజిటల్ , ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సైతం సాక్ష్యంగా పరిగణలోకి తీసుకొచ్చామని అన్నారు. వందేళ్ల వరకుఈ ఈ చట్టాలు న్యాయ ప్రక్రియలో ఉపయోగపడుతాయన్నారు.

ఈ బిల్లుల ప్రకారం యాక్సిడెంట్ చేసి పారిపోతే పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. యాక్సిడెంట్‌లో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పిస్తే శిక్ష సగానికి తగ్గిస్తారు. మూక దాడికి ఉరిశిక్ష, ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. మైనర్‌పై గ్యాంగ్ రేప్ చేస్తే జీవితకాల శిక్ష, మైనర్ చనిపోతే నిందితులకు ఉరి శిక్ష అమలు చేస్తారు. దేశ ద్రోహానికి జీవితకాల శిక్ష నుంచి ఏడేళ్లకు మార్పు చేశారు. నేరం చేసి వేరే దేశానికి పారిపోయిన వారు 90రోజుల్లో కోర్టులో లొంగిపోవాలి. లేదంటే వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పును ప్రకటిస్తారు. అలాంటి నేరస్తులను విదేశాల నుంచి తీసుకొచ్చి ఉరి తీస్తారు.

Tags:    

Similar News