Lockdown in UP again: నేటి నుంచి మరోసారి లాక్ డౌన్..యుపీ ప్రభుత్వం నిర్ణయం
Lockdown in UP again: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి.
Lockdown in UP again: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ క్రమంలో యూపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 13 ఉదయం 5 గంటల వరకు.. 55 గంటలు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఛీఫ్ సెక్రెటరీ ఆదేశించారు. అయితే.. రైళ్లు, విమాన సర్వీసులు యధావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లోమళ్లీ లాక్ డౌన్ పెట్టాలని ఆ రాస్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి జూలై పదమూడో తేదీ వరకు లాక్ డౌన్ ను విదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 1,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 18 మంది కరోనా వల్ల మరణించారు. యూపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,156కి చేరినట్లు ఆ రాష్ట్ర హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు.శని,ఆదివారాలు అధికంగా ప్రజలు బయటకు రాకుండా లాక్ డౌన్ విదిస్తున్నారని అనుకోవచ్చు.