BJP vs Congress: జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్ధం
BJP vs Congress: జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోడీకి ఖర్గే రాసిన లేఖకు జేపీ నడ్డా కౌంటర్ లేఖ రాశారు.
BJP vs Congress: జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోడీకి ఖర్గే రాసిన లేఖకు జేపీ నడ్డా కౌంటర్ లేఖ రాశారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు. తాజాగా ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ కౌంటర్ లెటర్ రాశారు.
ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి, విధానాలను మెరుగుపర్చి.. రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకెళ్లడానికే మీరు లేఖ రాశారన్నారు. ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అన్పించిందన్నారు.
మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మర్చిపోయినట్లు అన్పిస్తుందన్నారు. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించానని.. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ.. ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితో కాపీ అండ్ పేస్ట్ పార్టీగా మారపోవడం బాధాకరమన్నారు జేపీ నడ్డా.