ఆర్టీసీ సమ్మెపై రాజ్‌భవన్ బాట పట్టారు అఖిలపక్ష నేతలు. సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్‌తో తమ విన్నపాన్ని మొరపెట్టుకున్నారు. ఎప్పుడు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోవాలని, సమ్మెను చట్ట వ్యతిరేకంగా చూడొద్దన్నారు. అలాగే సునీల్ శర్మ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం పోరాడుతామన్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను కలిసి ఆర్టీసీ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు అఖిలపక్షం నేతలు.