JNVST 2022: నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు చివరితేదీ పొడగింపు..
JNVST 2022: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9 తరగతి ప్రవేశాలకు గడువుతేదీని పొడగించారు.
JNVST 2022: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9 తరగతి ప్రవేశాలకు గడువుతేదీని పొడగించారు. గతంలో చివరితేదీ అక్టోబర్ 31గా నిర్ణయించారు. తాజాగా నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. NVS పరీక్ష 9 ఏప్రిల్ 2022న నిర్వహిస్తారు. కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- nvsadmissionclassnine.in ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.
9వ తరగతి కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై అడిగిన వివరాలను నమోదు చేయాలి. వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవడం ద్వారా రిజిస్ట్రేషన్‌ను ప్రక్రియ పూర్తి చేస్తారు. NVS విడుదల చేసిన JNVST 2022 క్లాస్ 9 ప్రాస్పెక్టస్ ప్రకారం.. గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేరు. అలాగే, విద్యార్థి తప్పనిసరిగా మే 1, 2006 కంటే ముందుగా, 30 ఏప్రిల్ 2010 తర్వాత జన్మించి ఉండకూడదు.