Kolkata Doctor Rape and Murder Case: సెమినార్ హాల్లో నుంచి ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదా : సీబీఐ
Kolkata Doctor Rape and Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం క్రికెట్ చేసిన కోల్ కతా వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో సీబీఐీ కీలక విషయాలను వెల్లడించింది. ఆసుపత్రిలో భద్రత లోపాలను ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యులతోపాటు ఆసుపత్రి సిబ్బంది విచారించిన సిబిఐ పలు విషయాలను వెల్లడించింది.
Kolkata Doctor Rape and Murder Case: కోల్ కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి విచారిస్తున్న సిబిఐ పలు కీలక అంశాలను వెల్లడించింది. సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పనిచేయడం లేదని తమ విచారణలో బయటపడినట్లు తెలిపింది. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్న సమయంలో హాల్లో నుంచి ఆమె శబ్దాలు బయటకు ఎవ్వరికీ వినిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
సెమినా్ హాల్ డోర్ బోల్ట్ విరిగింది. నేరం జరుగుతుండగా ఎవరూ లోనికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చుండి ఎవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ చేపట్టినట్లుగా సిబిఐ తెలిపింది. ఈ అంశాన్ని నిర్దారించేందుకు సిసిటివి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. బాధితురాలిని చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవరికీ వినిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వ్యాఖ్యానించింది.
బోల్డ్ పనిచేయకపోవడం గురించి ఇంటర్న్ లు, జూనియర్ డాక్టర్ సిబ్బంది విచారణలో బయటపెట్టినట్లు సిబిఐ తెలిపింది. దీంతో బోల్ట్ వ్యవహారం బయటకు వచ్చింది. బాధితురాలు ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య సెమినార్ హాల్లోకి ప్రవేశించినట్లు డ్యూటీలో ఉన్న డాక్టర్ చెప్పినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఆర్జీ కర్ మెడికల్ కళాశాల అండ్ ఆసుపత్రి ఆర్థిక అవకతవకలపై సిట్ దర్యాప్తునకు సీబీఐకి బదిలీ చేయాలని కోల్ కతా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రిలో జరిగిన అవకతవకలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విచారణ జరిపించాలంటూ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ వేశారు. శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టి బెంగాల్ హైకోర్టు విచారణకు సిబిఐకి బిదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 3 వారాల్లోకి దర్యాప్తు ప్రొగ్రెస్ రిపోర్టును సమర్పించాలని జస్టిస్ రాజర్షి భరద్వాజ్ సిబిఐని ఆదేశించారు. తర్వాత విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడింది.