Karnataka Honey Trap: కర్ణాటకలో 48మంది నేతలకు వలపు వల.. అసెంబ్లీ సాక్షిగా బయటపడిన నిజాలు!

Karnataka Honey Trap: కర్ణాటక అసెంబ్లీలో మంత్రి రాజన్న చేసిన వ్యాఖ్యలు హని ట్రాపింగ్‌ వివాదాన్ని రాష్ట్రతదదవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.

Update: 2025-03-20 16:12 GMT
Karnataka Honey Trap

Karnataka Honey Trap: కర్ణాటకలో 48మంది నేతలకు వలపు వల.. అసెంబ్లీ సాక్షిగా బయటపడిన నిజాలు!

  • whatsapp icon

Karnataka Honey Trap: కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంఘటనలో, మంత్రి కె.ఎన్. రాజన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన కలకలం రేపింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, దాదాపు 48 మంది రాజకీయ నేతలు, అందులో కేంద్ర నేతలు కూడా హనీ ట్రాప్‌కు గురయ్యారని తెలిపారు. ఈ అంశం ఏకపక్షంగా లేదని, ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇందులో ఉన్నారని చెప్పారు.

అసెంబ్లీలో జరిగిన ఈ వివాదంపై తీవ్ర చర్చలు జరిగాయి. ఇద్దరు ముఖ్యమైన మంత్రులు హని ట్రాప్‌కు గురయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయని.. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని రాజన్న డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకురావాలని, దీనికి బాధ్యులెవరో వెల్లడించాలని కోరారు.

ఈ హనీ ట్రాపింగ్‌ వ్యవహారం ఆరు నెలలుగా జరుగుతుందని రాజన్న కుమారుడు రాజేంద్ర వెల్లడించారు. వాట్సాప్ కాల్స్, సందేశాల ద్వారా పలువురిని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా దర్యాప్తు చేపట్టాలని, హోం మంత్రికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర ఈ అంశంపై ఎలాంటి సమాచారం లేదని, విచారణ అనంతరం పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని తెలిపారు. బీజేపీ దీనిపై ప్రత్యేక దర్యాప్తు డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేతలు కేసును ఒక సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఇది ప్రభుత్వమే ప్రేరేపించిన కుట్ర కాదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయానికి ఈ విషయమై ఫిర్యాదు అందినట్లు సమాచారం.

Tags:    

Similar News