Passport: పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..
Passport Renewal Process: పాస్‌పోర్ట్ అనేది ఒక దేశంలో నివసించే ఒక వ్యక్తి ఒక గుర్తింపు కార్డు. ఇది వారి జాతీయతను ధ్రువీకరిస్తుంది. ఎప్పుడైనా విదేశీ ప్రయాణం చేయాల్సి వస్తే పాస్‌పోర్ట్ తప్పనిసరి.

Passport Renewal Process: సాధారణంగా మన ఇండియన్ పాస్‌పోర్టుకి పదేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ గడువు దాటితే మళ్లీ రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్టూడెంట్, వర్కర్ అయినా పాస్‌పోర్ట్ కచ్చితంగా కలిగి ఉండాల్సిందే. అంతేకాదు ఎప్పుడైనా విదేశాకలకు వెకేషన్స్ వెళ్లాలన్నా వ్యాలిడ్ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. అయితే పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీకి ముందుగానే రెన్యువల్ చేసుకోవాలి. దీన్ని ఇంట్లోనే సులభంగా చేసుకునే అవకాశం ఉంది.
ఆన్‌లైన్లో పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకునే విధానం..
పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
ఒకవేళ మీకు ఖాతా లేకపోతే రిజిస్టర్ చేసుకొని.. కొత్త యూజర్ నేమ్ సెట్ చేయాల్సి ఉంటుంది.
లేదా ఇప్పటికే మీరు మీ ఖాతాపై లాగిన్ ఉంటే 'అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్/ రీ ఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్ రెన్యు పాస్పోర్ట్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్‌లో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు రెన్యువల్ కోసం మీరు పాస్‌పోర్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ చలానా ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చు.
చెల్లింపు పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోండి. ఆరోజు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి పత్రాలను కూడా తీసుకొని వెళ్ళండి. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆ తర్వాత మీ పాస్‌పోర్ట్ రెన్యువల్ స్టేటస్ ఆన్ లైన్‌లో మీరు సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్లో పాస్‌పోర్ట్ రెన్యువల్ విధానం..
మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి.. ఫిజికల్ పాస్‌పోర్ట్ రెన్యువల్ ఫామ్. ఈ ఫామ్ పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. రెండోది మీ జిల్లా పాస్‌పోర్ట్ సెల్ ఆఫీస్ వెళ్లి రూ.10 నామమాత్రపు ఫీజు చెల్లించి ఫామ్ తీసుకోండి.
మీ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. ఆ తర్వాత జిల్లా పాస్‌పోర్ట్ సెల్‌కు వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ స్టేటస్‌ను ఆ నంబర్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.