Indian History: ఈ రాజ్‌పుత్ రాజు ఇండియాకు వెన్నుపోటు పొడిచాడా? ఇండియాలో రాజకీయ తుపానుకు కారణమైన ఎపిసోడ్‌పై పూర్తి వివరాలు తెలుసుకోండి!
Rajput King Rana Sanga: రాణా సంగా బాబర్‌ను పిలిచాడా? చరిత్ర స్పష్టంగా చెప్పకపోయినా, రాజకీయాలు మాత్రం నేటి భారత రాజకీయాన్ని ఉత్కంఠగా మార్చాయి.

Indian History: ఈ రాజ్‌పుత్ రాజు ఇండియాకు వెన్నుపోటు పొడిచాడా? ఇండియాలో రాజకీయ తుపానుకు కారణమైన ఎపిసోడ్‌పై పూర్తి వివరాలు తెలుసుకోండి!
Rajput King Rana Sanga: ఇటీవల పార్లమెంట్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్ చేసిన ఓ వ్యాఖ్య రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆయన రాజపుత్ నాయకుడు రాణా సంగాను 'ద్రోహి'గా అభివర్ణిస్తూ, "ఇండియాపై బాబర్ దాడి చేయడానికి ఆహ్వానం ఇచ్చినవాడు రాణా సంగానే!" అన్నారు.
ఈ వ్యాఖ్యపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ సమాజాన్ని అవమానించినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాణా సంగా నిజంగానే బాబర్‌ను పిలిచాడా అన్నది చరిత్రకారుల మధ్య తీవ్ర చర్చనీయాంశం. బాబర్ స్వయంగా రాసిన బాబర్నామాలో రాణా సంగా నుంచి సహకారం లభించిందని కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. కానీ ఆధునిక చరిత్రకారులు అతన్ని నేరుగా ఆహ్వానం ఇచ్చినట్టు మాత్రం అంగీకరించడం లేదు.
చరిత్ర ప్రకారం, దౌలత్ ఖాన్ లోదీ, ఆలం ఖాన్ లాంటి లోది రాజవంశానికి చెందిన వ్యక్తులే బాబర్‌ను ఆహ్వానించారు. రాణా సంగా, బాబర్‌ను ఒక కలవరం నాయకుడిగా చూస్తూ, లోదీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి అతన్ని ఉపయోగించుకోవాలని భావించాడని భావిస్తారు. కానీ బాబర్ ఢిల్లీని చేజిక్కించుకొని.. ఇండియాపై హక్కు ప్రకటించుకున్నప్పుడు, రాణా సంగానే అతనికి ఎదురుగా నిలిచాడు.
1527లో జరిగిన ఖాన్వా యుద్ధంలో రాణా సంగాను బాబర్ ఓడించి, మొఘల్ పాలనకు బలమైన ఆరంభం ఇచ్చాడు. ఇప్పటికీ రాణా సంగా బాబర్‌ను పిలిచాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఈ అంశం ఆధారంగా రాజకీయ నాయకులు ఒకరినొకరు దుయ్యబట్టుకుంటున్నారు.