Weather Update: రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం:ఐఎండీ

Weather Update: రాబోయే 4 రోజులు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అనేక రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో తేలికపాటి నుండి మితమైన వర్షాలు కురుస్తాయి. కర్ణాటకలో బలమైన గాలులు (గంటకు 30-50 కి.మీ)ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
మార్చి 25-27: కేరళ, మాహేలో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది .
మార్చి 25-27: జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లలో మెరుపులు, ఉరుములతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
మార్చి 25-27: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు, ఉత్తరాఖండ్‌లో మార్చి 26-27 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మార్చి 26: జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిట్-బాల్టిస్తాన్ ముజఫరాబాద్‌లలో కొన్ని చోట్ల భారీ వర్షాలు / హిమపాతం సంభవించవచ్చు.
మార్చి 27, 28: తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం , రాయలసీమలలో వేడి తేమతో కూడిన పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.