సీఎం యోగి అదిత్యనాథ్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో లోపం... ఎమర్జెన్సీ ల్యాండింగ్
Yogi Adityanath charterd flight: సీఎం యోగి అదిత్యనాథ్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో లోపం... ఎమర్జెన్సీ ల్యాండింగ్

సీఎం యోగి అదిత్యనాథ్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో లోపం... ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఆగ్రా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఆగ్రాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సిఎం యోగి లక్నో బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
యోగి ఛార్టర్డ్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విమానంలో సాంకేతిక సమస్యను రిపేర్ చేసేందుకు గంట సమయం పట్టింది. అంతసేపూ సీఎం యోగి ఎయిర్ పోర్టు వీఐపీ లౌంజ్ లో వెయిట్ చేశారు.
ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లైట్
సీఎం యోగి ఆగ్రా ఎయిర్ పోర్టులో వెయిట్ చేస్తుండగానే ఆయన కోసం ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లైట్ వచ్చింది. ఆ విమానంలో ఆయన లక్నో వెళ్ళిపోయారు.
లక్నోలో ఈవెంట్ క్యాన్సల్
యోగి ప్రభుత్వం 8 ఏళ్ల పాలనను పురస్కరించుకుని లక్నోలో ఇందిరా గాంధీ ప్రతిస్తాన్ లో స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సీఎం యోగి ఆ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఫ్లైట్ ప్రాబ్లం కారణంగా ఆలస్యం అవడంతో ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.
2017 లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు, ఆ తరువాత ఈ 8 ఏళ్లలో ఉత్తర్ ప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందింది అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ విజిట్ చేస్తున్న పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. 2017 లో యుపీలో వారణాసి, లక్నో ఎయిర్ పోర్టులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 16 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అందులో 4 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్నాయని తెలిపారు.