
ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
1) తెలంగాణను దేశానికే ఆదర్శంగా...
దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై వస్తోన్న ఆరోపణలు, అడ్డంకుల గురించి ప్రస్తావిస్తూ అభివృద్ధి పనులు జరిగేటప్పుడు కొన్ని అడ్డంకులు ఉంటాయన్నారు. ప్రభుత్వాలు తీసుకొచ్చే ఏ విధానానికి నూటికి నూరు శాతం ఆమోదం లభించదని అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2) పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని...
పేదరికం నిర్మూలన కోసం, పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడం కోసం అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మకు సార్దకత చేకూరుతుందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజలు వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. వాట్సాప్ గవర్నన్స్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందించేందుకు కృషి చేసే బాధ్యత తనది అని చంద్రబాబు అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితా
ఇటీవల గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఆ వివరాలు అందుబాటులో ఉన్నట్లు కమిషన్ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
4) Train derailed: పట్టాలు తప్పిన బెంగళూరు-కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు
Bengaluru Kamakhya Express train derailed: బెంగళూరు-కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఒడిషాలోని కటక్‌కు సమీపంలోని నిర్గుండి స్టేషన్‌కు దగ్గరలో ఆదివారం మధ్యాహ్నం 11:54 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పట్టాలు తప్పిన 11 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఘటన జరిగిన ప్రాంతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్, ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనజర్ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంపంలో 1600 దాటిన మృతుల సంఖ్య
బ్రేకింగ్ న్యూస్.. మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మయన్మార్‌లో దేశ రాజధాని తరువాత రెండో అతిపెద్ద నగరమైన మండాలయ్ సమీపంలో మరోసారి భూమి కంపించింది. ఈసారి భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. అమెరికా జియాలాజికల్ సర్వే విభాగం ఈ వివరాలను వెల్లడించింది. మండాలయ్ నగరంలో జనం ఇళ్లు, భవనాలు విడిచి వీధుల్లోకి పరుగెత్తారు.
ఇప్పటికే శుక్రవారం నాటి భూకంపం మయన్మార్‌లో భారీ మొత్తంలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మయన్మార్ దేశానికి పొరుగునే ఉన్న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోనూ ఈ భూకంపం పెను విషాదానికి కారణమైంది. నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం భూకంపం ధాటికి కుప్పకూలింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) చైనా ఉత్పత్తులే కాదు... చైనా కంపెనీ కట్టిన బిల్డింగ్స్ కూడా అంతేనా?
బ్యాంకాక్‌లో భూకంపం ధాటికి 33 అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో 17 మంది మృతి చెందారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న పదుల సంఖ్యలో జనం పరిస్థితి ఏంటో ఇంకా తెలియదు. ఘటన జరిగి 48 గంటలు దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉంటారేమోననే ఆశతో రెస్క్యూ టీమ్ తమ సహాయ చర్యలు కొనసాగిస్తోంది.
బ్యాంకాక్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ కట్టడాలు చాలానే ఉన్నాయి. అందులో భారీ అంతస్తుల కట్టడాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అవేవి పెద్దగా తినలేదు. కానీ ఈ 33 అంతస్తుల భవనం మాత్రం 5 సెకన్లలో కుప్పకూలి శిథిలాల గుట్టగా మిగిలింది. ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. ఈ ఘటన తరువాత కనిపించకుండా పోయిన వారంతా ఆ శిథిలాల కిందే చిక్కుకుని ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.