Viral Video: కదిలే వనమా..లేక రోడ్డుపై నడిచే ఆటోనా ఇదేంట్రా బాబు ఇంత క్రియేటివిటీ..?

Viral Video: మనం కార్లలోను బస్సుల్లోనూ వెళ్తున్నప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటాము. తద్వారా వేడి గాలి నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. కానీ మరి మూడు చక్రాల ఆటోలో ఎర్రటి ఎండలో బయటకు వెళితే తల వేడెక్కి ముచ్చమటలు పట్టడం ఖాయం. ఎందుకంటే ఆటోలో ఏసీ వేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే మిట్ట మధ్యాహ్నం ఆటో ఎక్కాలంటేనే చుక్కలు కనిపించే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ మడుగు వేసే విలో ఆటోలో కూర్చున్నా కూడా ఏసీ లాంటి గాలి కావాలంటే ఏం చేయాలా అని మరో ఆటోవాలా బుర్రలో ఒక ఐడియా పుట్టింది. వెంటనే అది అప్లై చేసేసాడు. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించాలంటే పచ్చదనాన్ని మించిన మరో పరిష్కారం లేదని భావించిన ఆటోవాలా వెంటనే తన ఆటోను ఒక కదిలే వనంలా మార్చేశాడు. ఆటో రూపు పైన పచ్చ గడ్డి పనిచేసి చుట్టూ మొక్కలతో నింపేసి ఆటోలో కూర్చునే వ్యక్తులకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందించేశాడు. ఈ ఆటో ఎక్కిన కస్టమర్లకు పచ్చటి ఆకులు చుట్టూ ఉండి, ఎండ వేడిమి నుంచి బయట పడేయడంతో పాటు ఆహ్లాదాన్ని కూడా అందిస్తున్నాయి. అతి తక్కువ ఖర్చుతోనే ఏసీ ని మించిన చల్లదనాన్ని సృష్టించి పొల్యూషన్ తో నిండిన రోడ్డు మధ్యలో ఆక్సిజన్ అందిస్తూ కదిలే ఈ ఆటోవాలా అంకుల్ ఐడియాను చూసి నెటిజెన్లు శభాష్ అంటున్నారు. పచ్చదనం అనేది ఎప్పటికైనా ప్రపంచాన్ని చల్లగా ఉంచే ఏకైక మార్గమని, ఈ ఆటోవాలా చెప్పే సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించి ఆటో మాత్రమే కాదు తమ ఇళ్ళను కూడా ఇలా పచ్చగా మార్చుకుంటే ఏసీ అవసరం లేకుండా ఎంచక్కా హాయిగా ఉండవచ్చని నెటిజెన్స్ పేర్కొంటున్నారు.