Dating App: డేటింగ్ యాప్‌లో ప్రేమ.. చివరకు 6 కోట్లు వదిలించుకున్నాడుగా!
Dating App: ఈ ఘటన మళ్లీ ఒకసారి డేటింగ్ యాప్స్, ఆన్‌లైన్ ట్రేడింగ్ వెబ్‌సైట్లలో నమ్మకంతో పెట్టుబడులు పెట్టే వారి పట్ల హెచ్చరికగా నిలిచింది.

Dating App: డేటింగ్ యాప్‌లో ప్రేమ.. చివరకు 6 కోట్లు వదిలించుకున్నాడుగా!
Dating App: నోయిడాకు చెందిన డల్జిత్ సింగ్ అనే వ్యాపారి, డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళతో మాట్లాడుతూ, చివరికి రూ. 6.5 కోట్ల నష్టం పాలయ్యాడు. మొదట ప్రేమగా మొదలైన పరిచయం, చివరకు అతనిని నమ్మకద్రోహం బారిన పడేసింది. డిసెంబర్ 2024లో డేటింగ్ యాప్‌లో అనిత చౌహాన్ అనే మహిళను కలిసిన డల్జిత్, ఆమె సూచనతో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాడు. మొదటి పెట్టుబడి రూ. 3.2 లక్షలపై రూ. 24,000 లాభం రావడంతో అతను మరిన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు.
అపరిమిత లాభాల మాయ చూపిస్తూ అనిత, అతని నుంచి రూ. 6.52 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించింది. ఈ మొత్తం డల్జిత్ పలు ఖాతాలకు పంపించినట్టు చెప్పాడు. ఇందులో కొంత భాగాన్ని అతను అప్పుగా తీసుకున్నట్టు కూడా వెల్లడించాడు. కానీ అసలు నష్టాలు అప్పుడే మొదలయ్యాయి.
తాను పెట్టుబడి పెట్టిన వెబ్‌సైట్లు SpreadMKT, Sprecdex.ccల నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా, 30 శాతం సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్ చేయడం ప్రారంభమైంది. అంతేకాకుండా, మరో రూ. 61 లక్షల ఎక్స్చేంజ్ ఫీజు కూడా కోరారు. ఈ ఘటనలతో డల్జిత్‌కు అనుమానం వచ్చి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాంకు వివరాలు లీకైపోయినట్టు అనుమానించడంతో, తాను మాత్రమే కాదు తన తల్లి భద్రతపై కూడా భయం వ్యక్తం చేశాడు. ట్రాన్సాక్షన్ల వివరాలతో పాటు అనితా ఫోన్ నంబర్, వెబ్‌సైట్ వివరాలు అందజేస్తూ పోలీసుల సహాయాన్ని కోరాడు.