West Bengal: ప్రభుత్వానికి సుప్రీం బిగ్ షాక్..ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవు

Update: 2025-04-03 06:05 GMT

West Bengal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాకిచ్చింది. బెంగాల్ రాజకీయాలను కుదిసేని ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పునిచ్చింది. అవతకవల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీం తేల్చి చెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది.

Tags:    

Similar News