
Hanuman Jayanthi: మధ్యప్రదేశ్‌లోని గుణ హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గుణలోని కల్నల్‌గంజ్ ప్రాంతంలో ఊరేగింపు జరుగుతుండగా.. ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగి పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఊరేగింపు ఘోసి మొహల్లాలోని మడియా ఆలయం నుండి బయటకు తీసుకువెళ్లారు. ఊరేగింపులో ఇంకా దాదాపు 50 మంది ఉన్నారు. ఊరేగింపు హాట్ రోడ్ ఫోర్డ్ వైపు వెళ్ళిన వెంటనే, మదీనా మసీదు సమీపంలోని సమద్ చౌక్ వద్ద దానిపై దాడి జరిగింది. అక్కడున్న పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది అల్లరిమూకలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఊరేగింపుకు అనుమతి లేదని..రాళ్లదాడికి పాల్పడిన వారిపై ఎఫ్ ఐర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.