Train derailed: పట్టాలు తప్పిన బెంగళూరు-కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు

Bengaluru Kamakhya Express train derailed in Odisha: బెంగళూరు-కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

Update: 2025-03-30 09:13 GMT
Bengaluru Kamakhya Express train derailed near Nirgundi station in Odisha, 11 coaches derailed

పట్టాలు తప్పిన బెంగళూరు-కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు... పక్కకు వెళ్లిన 11 బోగీలు 

  • whatsapp icon

Bengaluru Kamakhya Express train derailed: బెంగళూరు-కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఒడిషాలోని కటక్‌కు సమీపంలోని నిర్గుండి స్టేషన్‌కు దగ్గరలో ఆదివారం మధ్యాహ్నం 11:54 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పట్టాలు తప్పిన 11 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఘటన జరిగిన ప్రాంతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్, ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనజర్ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందితో బయల్దేరిన యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ కూడా అక్కడికి చేరుకుంది.

ఘటనపై స్పందించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో

ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో అశోక కుమార్ మిశ్రా బెంగళూరు-కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటనపై స్పందించారు. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదని మిశ్రా తెలిపారు.

"11 ఏసీ బోగీలు పట్టాలు తప్పినట్లుగా చెప్పారు. ఇప్పటికే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. మెడికల్ రిలీఫ్ ట్రైన్ కూడా వెళ్లింది. రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏంటనేది దర్యాప్తులో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్లను మరో ప్రత్యామ్నాయ మార్గంలో డైవర్ట్ చేస్తున్నాం. ఘటన స్థలంలో మరమ్మతులు చేపట్టి త్వరలోనే రైళ్ల రాకపోకలు కొనసాగించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యం" అని మిశ్రా తెలిపారు. 

Tags:    

Similar News