CIA: కశ్మీర్ గురించి అమెరికా సంచలన రిపోర్టు.. పాక్ ఖేల్ ఖతం!
CIA: ఒక దేశం.. తన ఉనికి కోసం ఎంత దూరం వెళ్ళగలదో.. అప్పుడు రాసిన అక్షరాలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి.

CIA: కశ్మీర్ గురించి అమెరికా సంచలన రిపోర్టు.. పాక్ ఖేల్ ఖతం!
CIA America files Pahalgam attack India vs Pakistan
CIA: ఒక సీక్రెట్ డాక్యుమెంట్... ఒక సైలెంట్ వార్నింగ్... నేటి యథార్థాన్ని దశాబ్దాల క్రితమే అక్షరాలుగా రాసింది అమెరికా. 1993లో అమెరికా గూఢచార సంస్థ CIA తన సీక్రెట్ రూమ్స్‌లో చేసిన విశ్లేషణ.. ఇప్పుడు మళ్లీ నిప్పులు రాజేసే వాస్తవంగా మారుతోంది. భారత ఉపఖండాన్ని కుదిపేసే భయంకర గమనాన్ని, దేశాల మధ్య పెరిగిన విష స్నేహాన్ని, రక్తపాతం మోయించే మార్గాన్ని అప్పుడే ఊహించింది. కాలం గడిచినా.. పరిస్థితులు మారినా.. కొందరి పద్ధతులు మాత్రం మారలేదని ఈ రోజులు స్పష్టం చేస్తున్నాయి. ఒక దేశం.. తన ఉనికి కోసం ఎంత దూరం వెళ్ళగలదో.. అప్పుడు రాసిన అక్షరాలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి.
1993లో CIA విశ్లేషణలో కూడా కశ్మీరే ప్రధాన అంశం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫ్లాష్‌పాయింట్‌గా కశ్మీర్‌ను CIA గుర్తించింది. అక్కడ జరిగే చిన్న చిన్న ఘటనలు కూడా ఓ విపరీతమైన యుద్ధాన్ని సృష్టించగలవని అమెరికా గూఢచార సంస్థ ఆనాడే హెచ్చరించింది. నిజానికి కశ్మీర్ అనే పేరు వినగానే పాకిస్థాన్‌లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతాయి. కశ్మీర్ తమదే తమదేనని ఇటు ఇండియా- అటు పాకిస్థాన్ దశాబ్దాలగా యుద్ధాలు చేస్తున్నాయి. ఇక ఇదే ముసుగులో మత విద్వేషాల రెచ్చగొట్టే పాకిస్థాన్.. భారత్‌ను కవ్వించేందుకు కుట్రలు నేస్తుందని CIA 32ఏళ్ల క్రితమే అంచనా వేసింది.
ఇక ఏప్రిల్ 22, 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చూస్తే అమెరికా మాటలు నిజమనే అర్థం చేసుకోవచ్చు. కుటుంబంతో ఎంతో సరదాగా గడిపేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. పాకిస్థాన్ మద్దతుతో యాక్టివ్‌గా ఉండే 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్ర సంస్థ ఈ దాడులకు తెగించింది. ఇక CIA నివేదిక ప్రకారం, ఇలాంటి ఉగ్రవాద చర్యలు కేవలం స్థానిక స్థాయిలో ఉండవు.. అవి దేశాల మద్య ఉన్న శాంతి ఒప్పందాలను, శాంతి మార్గాలను పూర్తిగా చీల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కశ్మీర్‌లో జరిగిన ఈ ఉగ్రఘటన.. ఒక పెద్ద యుద్ధానికి బీజం వేయగలదు. ఆ యుద్ధం కేవలం తుపాకులతో మాత్రమే కాదు.. అణు బాంబుల భయంకర మబ్బులను తెచ్చిపెట్టగలదని CIA అప్పట్లోనే తీవ్రంగా హెచ్చరించింది.