Pakistan Vs India: యుద్ధానికి దిగితే పాక్ గతి ఇదే.. నివురుగప్పిన నిజం!
Pakistan Vs India: ఓ దేశం ఎలా అంతరించపోయే స్థితికి వెళ్తుందో పాకిస్థాన్ పరిస్థితి ప్రపంచానికి ఓ పాఠం చెప్పేలా కనిపిస్తోంది!

Pakistan Vs India: యుద్ధానికి దిగితే పాక్ గతి ఇదే.. నివురుగప్పిన నిజం!
Pakistan Vs India: పాకిస్థాన్ తన అంతర్గత సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి కశ్మీర్‌లో మంటలు రగిలించే అవకాశాన్ని ఎప్పటికప్పుడు వెతుకుతుంది. అంతర్గత రాజకీయ లబ్ధి కోసమే కశ్మీర్‌లో అలజడిని సృష్టిస్తుంది. కశ్మీర్ విషయంలో ఏ చిన్న గొడవ జరిగినా.. అది భారత్-పాకిస్థాన్ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉంటాయన్నది పాక్‌కు తెలుసు. అందులోనూ రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.
అయితే ఒక దేశం గెలవాలంటే కేవలం ఆయుధాలు ఉంటే సరిపోదు. ఆర్థిక శక్తి కూడా బలంగా ఉండాలి. ఇటు పాకిస్థాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. పాకిస్థాన్ ఆర్థికంగా కుదేలైపోయింది. భారత్‌తో మిలిటరీ పరంగా పోటీ ఇవ్వడం సాధ్యం కాదు. ఇటు భారత్ ఆర్థికంగా పెద్ద దేశం.. ప్రపంచ వ్యాపార మార్కెట్లలో నమ్మకం కలిగిన దేశం... విదేశీ పెట్టుబడులు ఇండియా వైపు పారుతుంటే.. పాకిస్థాన్ మాత్రం అప్పుల ఊబిలో మునిగి పోయి ఉంది. అలాంటి దేశం భారత్‌తో యుద్ధానికి దిగితే ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చచ్చిపోతుంది. అటు ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్న దేశాలకు మద్దతు ఇవ్వవు.. పెట్టుబడులు కూడా నిలిపేస్తాయి. సహాయ నిధులు నిలిచిపోతాయి.
అంతేకాదు.. ఓ వైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొడుతోంది. మరోవైపు రాజకీయ అస్థిరత ఆ దేశంలో తిష్టవేసుకోని కూర్చింది. ఇటు అదే సమయంలో భారత్ సైన్యం తన ప్రతాపం చూపితే పాక్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. యుద్ధంలో ఓడిపోవడం వేరు.. యుద్ధం వల్ల దేశం ఆర్ధికంగా విచ్ఛిన్నమై, అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోవడం వేరు. ఇండియాతో యుద్ధానికి దిగితే పాకిస్థాన్‌కు అంతిమ ఘడియలు తప్పకపోవచ్చని CIA భావించింది. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా పాకిస్థాన్ అనే పేరు కనిపించకుండా చరిత్ర పుస్తకాల్లో ఒక పాత అధ్యాయంలా మిగిలిపోతుంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, ఆ రోజుల్లో ఊహించిన భయంకర నిజం ఇప్పుడు నెరవేరుతుందా అనే సందేహం మళ్లీ పుట్టుకొస్తోంది. ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా అహంకారంతో నాశనపు మార్గాన్ని ఎంచుకుంటే.. ఓ దేశం ఎలా అంతరించపోయే స్థితికి వెళ్తుందో పాకిస్థాన్ పరిస్థితి ప్రపంచానికి ఓ పాఠం చెప్పేలా కనిపిస్తోంది!