TOP 6 News @ 6PM:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.

TOP 6 News @ 6PM:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్
1. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తులో తేలిన విషయాలను నివేదిక ఇచ్చారు. పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను ఉన్నత న్యాయస్థానానికి జత చేసింది ప్రభుత్వం. దీన్ని అఫిడవిట్ రూపంలో కోర్టుకు అందించింది.
2. ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం: కెనడా
తమ దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారత్, చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ స్పై ఏజెన్సీ ఆరోపించింది. రష్యా, పాకిస్తాన్ కూడా ఆ ప్రయత్నం చేయవచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. తమ దేశంలో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఏఐ సాధనాలను శత్రు దేశాలు ఉపయోగించుకున్నట్టు తమకు సమాచారం ఉందని కెనడా సెక్యూరిటీ ఇంటలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వానెస్సా లాయిడ్ ఆరోపించారు.
3.వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సీఐడీ కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును సీఐడీ కోర్టు రిజర్వ్ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది.
4.మీర్‌పేట మాధవి కేసులో సంచలన విషయాలు
మీర్ పేటలో సంచలనం సృష్టించిన మాధవి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. గురుమూర్తి ఇంట్లో లభ్యమైన టిష్యూస్ మరణించిన మాధవిగా పరీక్షల్లో తేలింది. మాధవి పిల్లలు ఆమె తల్లితో కూడా ఈ డిఎన్ఏ మ్యాచ్ అయినట్టు ఫోరెన్సిక్ అధికారులు తెలిపారు. మాధవిని హత్య చేసి ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఎముకలను పొడిగా చేసి చెరువులో వేశారు.
5.పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి: అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ
పీఎం-కిసాన్ సమ్మాys Vivekananda reddy, ysrcp, Canada, elections, meerpet case, madavi, cm-kisan samman nidhi, slbc tunnel,న్ నిధి పథకంలో అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. లోక్‌సభలో పలువురు అడిగిన సభ్యుల ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6 వేలను మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. 19 విడతల్లో రూ.3.68 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
6.ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: మరో డెడ్ బాడీ వెలికితీత
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో డెడ్ బాడీని మంగళవారం రెస్క్యూ టీమ్ వెలికితీసింది.డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.ఫిబ్రవరి 22న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎనిమిది మంది చిక్కుకున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిలో రెండు డెడ్ బాడీలను వెలికితీశారు. ఇంకా ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.