Indigo Airlines: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి..తప్పిన పెను ప్రమాదం..విమానంలో 179మంది ప్రయాణికులు

Indigo Airlines: కేరళలోని తిరువనంతపురంలో పెను ప్రమాదం తప్పింది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం పక్షి ఢీకొన్న సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత విమానంను రద్దు చేశారు అధికారులు. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, పక్షి విమానాన్ని ఢీకొన్నప్పుడు, విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈఘటన సోమవారం ఉదయం జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తిరువనంతపురం నుండి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో క్యాన్సిల్ అయినట్లు తెలిపారు.
పక్షులు విమానాలను ఢీకొన్న కేసులు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వందలాది పక్షులు ఢీకొన్న సంఘటనలు కనిపించాయి. నివేదిక ప్రకారం, పక్షుల ఢీకొనడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 250 కి పైగా విమానాలు ధ్వంసమయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణ కొరియాలో పక్షి ఢీకొన్న కేసు నమోదైంది. దీని కారణంగా విమానంలో ఉన్న 124 మంది ప్రాణాలు కోల్పోయారు