Top 6 News @ 6PM: ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా, మరో 5 ముఖ్యాంశాలు

1.ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా
ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్ సైట్లను ఆర్థికశాఖ పరిధిలోని డీజీజీఐ బ్లాక్ చేసింది. ఈ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంకు ఖాతాలు సీజ్ చేశారు. అంతేకాకుండా రూ.126 కోట్లను ఫ్రీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్
2.అమెరికాలో ఒకే రోజు ట్రంప్ గోల్డ్ కార్డులకు డిమాండ్:
డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డులకు భారీగా గిరాకీ నెలకొంది. ఒక్క రోజులోనే వెయ్యి గోల్డ్ కార్డులను విక్రయించినట్టు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ప్రకటించారు. వీటి ద్వారా 5 బిలియన్ డాలర్లు సేకరించినట్టు ఆయన తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్లను గోల్డ్ కార్డుల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. 5 మిలియన్ డాలర్ు చెల్లిస్తే అమెరికా పౌరసత్వం అందిస్తారు. అమెరికాలో సంపన్నులకు నేరుగా ఈ కార్డు ద్వారా సిటిజన్‌షిప్ వస్తోంది.
3.డీలిమిటేషన్ పై చెన్నైలో ఆల్ పార్టీ భేటీ: రెండో మీటింగ్ హైద్రాబాద్‌లో
లోక్‌సభ నియోజకవర్గాలలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే విషయమై శనివారం చెన్నైలో డీఎంకె ఆల్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షులు బల్వీందర్ సింగ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టం కలుగుతోందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి చెల్లిస్తే తమకు తిరిగి 42 పైసలు మాత్రమే తిరిగి వస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లోక్‌సభ సీట్ల పెంచకుండా రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేయాలని ఆయన కోరారు. నెక్స్ట్ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశం ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే ప్రకటించనున్నారు.
4.యూట్యూబర్ సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీస్
యూట్యూబర్ సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసు జారీ అయింది. ఈ నెల 5న నూతన్ కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను సన్నీ యాదవ్ ప్రమోట్ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నారని పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయనను విదేశాల నుంచి రప్పించేందుకు ఈ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సన్నీ యాదవ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
5.కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ శనివారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆ పార్టీ సభ్యులు ఆరోపించారు. ఉప్పల్ ఎలివేటేడ్ కారిడార్ కు ఎస్రో అకౌంట్ తెరవలేదని మంత్రి ఇచ్చిన సమాధానం అవాస్తవమని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆధారాలు అందించారు. కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అనుమతించాలని కోరారు.
6.వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్
ప్రముఖ హీందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్ గఢ్ నుంచి తొలిసారిగా ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయిత.ప్రముఖ కథకురాలు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన జరిగిన జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందీ సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన అత్యుత్తమ కృషికి ఆయనకు ఈ అవార్డు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ ఆ ప్రకటనలో తెలిపింది.శుక్లా రచించిన "దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతీ థీ" పుస్తకానికి 1999లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.