TOP 6 News @ 6PM: టీటీడీలో హిందూయేతర ఉద్యోగులు తొలగింపునకు నిర్ణయం: మరో 5 ముఖ్యాంశాలు

1. ట్రంప్ మాజీ కోడలితో టైగర్‌వుడ్స్ డేటింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ కోడలు వెనెసాతో తాను డేటింగ్ చేస్తున్నట్టు గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వెనెసాతో కలిసి దిగిన ఫోటోలను ఆయన ఈ పోస్టుతో పాటు జత చేశారు. ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ 2005లో వెనెసాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 13 ఏళ్లకు వీరిద్దరి బంధానికి తెరపడింది.2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
2. నాగ్‌పూర్ అల్లర్ల నిందితుడి ఇల్లు బుల్‌డోజర్ తో కూల్చివేత
నాగ్‌పూర్‌లో హింసకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫహీమ్ ఖాన్ కు చెందిన అక్రమ నిర్మాణాలను సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వం బుల్‌డోజర్లతో కూల్చివేసింది. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయాన్నిఅధికారులు గుర్తు చేశారు. ఫహీమ్ మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యక్షడిగా పనిచేస్తున్నారు. నాగ్ పూర్ లో తప్పుడు సమాచారం ద్వారా ఘర్షణలకు కారణమయ్యారని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
3. రూ.5,258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్: పాలకమండలి నిర్ణయం
టీటీడీలో హిందూయేతర ఉద్యోగులను తొలగించాలని టీటీడీ బోర్డు సోమవారం తీర్మానించింది. ఇవాళ పాలకవర్గం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.రూ.5,258.68 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది.టీటీడీ ఆస్తులు పరిరక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఆలయానికి చెందిన భూముల న్యాయపరమన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. వృద్దు, దివ్యాంగులకు ఆఫ్ లైన్ లో దర్శన టికెట్ల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు.
4. ఎల్ఆర్ఎస్ గడువు పెంపు లేదు: పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే ఆలోచన లేదని తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎల్ఆర్ఎస్ కు మంచి స్పందన వస్తుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ఆయన అన్నారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకుకూడా సర్వే చేయించి నిర్ధారిస్తామని ఆయన తెలిపారు.
5. ఎంపీల వేతనాలు 24 శాతం పెంపు
పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో 24 శాతం పెంపును నోటిఫై చేసింది కేంద్రం. వేతనాల పెంపుతో నెలకు రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు వేతనాలు పెరిగాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి వేతనాలు పెంపు వర్తించనుంది. మాజీ ఎంపీలకు చెల్లించే పెన్షన్ ను కూడా పెంచారు.
6. దిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో నగదు కట్టలు వెలుగు చూశాయనే ప్రచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.