America: H-1B వీసాలో మార్పులు.. కీలక డేటా తొలగింపు, భారతీయులకు వార్నింగ్?
America, H-1B: అమెరికా ప్రభుత్వం ఫారిన్ లెబర్ గేట్‌వే నుంచి పాత H-1B రికార్డులను తొలగించింది.

America: H-1B వీసాలో మార్పులు.. కీలక డేటా తొలగింపు, భారతీయులకు వార్నింగ్?
America, H-1B: మీరు ఇప్పటికే H-1B వీసా కోసం అప్లై చేశారా? లేదా అప్లై చేయబోతున్నారా? అయితే ఈ తాజా సమాచారం తప్పక తెలుసుకోవాల్సిందే. అమెరికా ప్రభుత్వం H-1B వీసా వ్యవస్థలో కీలకమైన మార్పులు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఇది భారతీయ ఐటీ ఉద్యోగులపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్, ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో H-1B వీసా అప్లికేషన్ ప్రక్రియను నిర్వహించే ఫారిన్ లెబర్ యాక్సెస్ గేట్‌వే సిస్టమ్‌లో 5 సంవత్సరాల కంటే పాత రికార్డులను తొలగించనున్నట్టు వెల్లడించింది. దీనివల్ల ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారు, ఇంకా అప్లై చేసిన వారు, అలాగే అమెరికాలో కంపెనీల వారు అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతం H-1B వీసా ద్వారా అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా TCS, ఇన్‌ఫోసిస్, HCL Tech లాంటి పెద్ద కంపెనీలు ఈ వీసాలపై ఆధారపడుతున్నాయి. పాత రికార్డులు తొలగించబడటంతో, వీరు తిరిగి వీసా రెన్యువల్ చేసుకునే సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇక ట్రంప్ పాలనలో ప్రవేశపెట్టిన కొత్త "బెనిఫిషియరీ-సెంట్రిక్" లాటరీ విధానం కూడా అమలులోకి రావచ్చు. అంటే.. కంపెనీ ఆధారంగా కాకుండా, వ్యక్తుల ఆధారంగా ఎంపిక జరిగే విధానానికి మారే ఛాన్స్ ఉంది. ఇది భారతీయ ఐటీ ఉద్యోగులకు షాక్ కావొచ్చు. ఇక వీసా హోల్డర్లు, కంపెనీలు తాము అప్లై చేసిన డాక్యుమెంట్లు, రికార్డులు పూర్తిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.