డీలిమిటేషన్‌‌పై చెన్నైలో ఆల్‌పార్టీ భేటీ: తెలంగాణ నుంచి రేవంత్, కేటీఆర్ హాజరు

Update: 2025-03-22 05:58 GMT
డీలిమిటేషన్‌‌పై చెన్నైలో ఆల్‌పార్టీ భేటీ: తెలంగాణ నుంచి రేవంత్, కేటీఆర్ హాజరు
  • whatsapp icon

డీలిమిటేషన్ పై శనివారం చెన్నైలో డీఎంకె నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ దూరంగా ఉన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందనే వాదన తెరమీదికి వచ్చింది. జనాభా నియంత్రణను సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ కారణంగా ఎంపీ స్థానాల సంఖ్య తక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండనుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటుందనేది ఈ ప్రాంత నాయకులు వాదిస్తున్నారు. అయితే డిలీమిటేషన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో శనివారం చెన్నైలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరుకావాలని దక్షిణాది రాష్ట్రాల కు చెందిన ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల నాయకులకు కూడా ఆయన లేఖలు పంపారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీసీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు పాల్గొన్నారు.

డీలిమిటేషన్ ను కచ్చితంగా వ్యతిరేకించాలని స్టాలిన్ కోరారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే విద్యార్థులు, మహిళలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో చరిత్రలోనిలిచిపోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.డీలిమిటేషన్ ను కచ్చితంగా వ్యతిరేకించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News