UP: దారుణం..పెళ్లికి పిలవలేదన్న కోపంతో వరుడి తండ్రిపై కాల్పులు

Update: 2025-03-22 02:56 GMT
UP: దారుణం..పెళ్లికి పిలవలేదన్న కోపంతో వరుడి తండ్రిపై కాల్పులు
  • whatsapp icon

UP: ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. తనను పెళ్లికి పిలవలేదన్న కోపంతో ఓ వ్యక్తి వరుడి తండ్రిపై కాల్పులకు తెగబడ్డాడు. నగరంలోని మండోలా ప్రాంతాంలో నివాసం ఉంటున్న సోనుకుమారుడి పెళ్లి మార్చి 22న జరిగేలా నిశ్చయించాడు. దీనిలో భాగంగా గురువారం హల్దీ వేడుక జరుగుతుండగా..పొరిగింట్లో ఉంటున్న వంశ్ వాల్మీకి ఫూటుగా మద్యం సేవించి వచ్చాడు. తనను పెళ్లికి ఎందుకు పిలవలేదని వరుడి తండ్రితో గొడవకు దిగాడు.

అక్కడున్న మహిళలతోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన వెంట తీసుకువచ్చిన నాటు తుపాకీ తీసి సోనూపై కాల్పులు జరిపి పరారు అయ్యాడు. ఎడమచేతికి బుల్లెట్ తగలడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఎప్పుడూ మద్యం మత్తులో ఉండే వంశ్ పెళ్లిలో ఇబ్బంది పెడతాడన్న ఉద్దేశంలోనే ఆహ్వానించలేదని వరుడు తెలిపాడు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చేపట్టినట్లు ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. 



Tags:    

Similar News