Online Gaming: ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 ఆన్లైన్ గేమ్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..
Online Gaming Blocked: ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ గేమ్ ప్లాట్‌ఫారమ్‌లపై కొరడా ఝుళిపించింది. డీజీజీఐ, ఆర్థిక మంత్రి శాఖ ఆధ్వర్యంలో 357 గేమ్‌లను బ్యాన్ చేసింది.

Online Gaming: ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 ఆన్లైన్ గేమ్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..
Online Gaming Blocked: దేశమంతా ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 విదేశీ ఆన్లైన్ గేమ్స్‌ను సీజ్ చేసింది. అంతే కాదు 2400 బ్యాంక్ ఖాతాలు కూడా దీంతో లింక్ అయి ఉన్నాయి. వాటిని కూడా ఫ్రీజ్ చేసింది కేంద్రం. ఈ గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ పన్ను ఎగ్గొట్టి, ఫేక్ బ్యాంకు ఖాతాను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత గేమ్స్ వల్ల ఇండియన్ యూజర్స్ డబ్బులు కోల్పోకుండా ఉండడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఈ గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్‌కు సంబంధించి ఓ కీలక ఆదేశం కూడా జారీ చేసింది. రిజిస్ట్రేషన్ లేని విదేశీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ గేమ్స్ వాడకూడదని ఆదేశించింది. క్రికెటర్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్స్ కూడా ఇలాంటి మోసపూరిత గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్‌ను ఏమాత్రం ప్రమోట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ వెబ్‌సైట్లతో ఇండియన్ యూజర్లు భారీ మొత్తంలో డబ్బులు కోల్పోతారని ఈ నిర్ణయం తీసుకుంది.
357 విదేశీ ఈ గేమింగ్ కంపెనీలపై డీజీసీఐ ఇన్విస్టిగేషన్ చేస్తోంది. వీరంతా జీఎస్టీ, పన్ను ఎగ్గొట్టడమే కాకుండా ఫేక్ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి కోట్లలో లావాదేవీలు చేపడుతున్నారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా 2,400 ఖాతాలను కూడా సీజ్ చేసింది. ఈ విదేశీ ఫేక్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ తో లింక్ అయి ఉన్న రూ.126 కోట్లు కూడా ఫ్రీజ్ చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఫేక్ విదేశీ గేమింగ్ ప్లాట్ ఫామ్స్ పై కొరడా ఝుళిపించింది కేంద్రం. ఇక ఈ అనుమతి లేని ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.