Kamal Haasan: ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆటలా.. 'ఫ్రీ క‌రోనా వ్యాక్సిన్' హామీపై కమల్‌హాసన్ ఫైర్‌

Kamal Haasan: బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే కరోనా టీకాను ఉచితంగా వేయిస్తామని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది

Update: 2020-10-23 17:13 GMT

  'ఫ్రీ క‌రోనా వ్యాక్సిన్' హామీపై కమల్‌హాసన్ ఫైర్‌

Kamal Haasan: బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే కరోనా టీకాను ఉచితంగా వేయిస్తామని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా తమ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ ప్రకటనతో తమిళవాసులు మండిపడుతున్నారు. తాజాగా ఇదే వ్యాఖ్య‌ల‌పై కమల్‌హాసన్ స్పందించారు. ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'పేదల ఆకలి, వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తే.. మీ రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని హెచ్చ‌రించారు. ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్‌ను ముందే ఇస్తామనడం ఒక చెత్త హామీ అని ఆయన ఖండించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అన్ని రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. 

ఈ విషయము పై  తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. కరోనా టీకా విషయంలో బీజేపీ తీరు సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. బీహార్‌లో ఉచితంగా కరోనా మందును పంపిణీ చేస్తానన్న కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News