యువతను వింత కోరిక కోరిన జపాన్‌.. ఫుల్లుగా మద్యం తాగాలని పిలుపు.. ప్రత్యేక ఆఫర్లు, పోటీలను నిర్వహిస్తున్న..

Japan: మద్యం.. ఇది ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థికంగా తీరని నష్టం కలిగిస్తుంది.

Update: 2022-08-20 12:00 GMT

యువతను వింత కోరిక కోరిన జపాన్‌.. ఫుల్లుగా మద్యం తాగాలని పిలుపు.. ప్రత్యేక ఆఫర్లు, పోటీలను నిర్వహిస్తున్న..

Japan: మద్యం.. ఇది ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థికంగా తీరని నష్టం కలిగిస్తుంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. మద్యమే గొడవలకు, అత్యాచారాలకు దారితీస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యాన్ని నిషేధించాలని కూడా కోరుతుంటారు. అయితే జపాన్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. యువత తగినంత అల్కాహాల్‌ను సేవించుట లేదని అక్కడి ప్రభుత్వం తెగ ఆందోళన చెందుతోంది మద్యం ప్రియులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. యువత పూటుగా తాగేయండని దేశ ఖజానాను నింపేయండని జపాన్‌ ప్రభుత్వం కోరుతోంది.

జపాన్‌ ప్రభుత్వం యువతకు వింతైన పిలుపునిస్తోంది. పూటుగా మద్యం తాగి ఊగాలని కోరుతోంది. జపాన్‌ యువత తగినంత ఆల్కాహాల్‌ తాగడం లేదని అక్కడి ప్రభుత్వం విపరీంతంగా ఆందోళన చెందుతోంది. తగినంత అంటే రోజుకో గ్లాసు చొప్పున వైన్‌ తాగితే చాలంటున్నారు అక్కడి ప్రజలు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం మద్యం కంపెనీలు ఇచ్చే నిధుల కారణంగా పరిశోధనలను తారుమారు చేసి చెబుతున్నారు. తగినంత ఆల్కహాల్‌ అనేది ఏమీ లేదని అక్కడి బార్ టెండరుదారులు చెబుతున్నారు. ఎక్కువ తాగితే ఎక్కువ ఆఫర్లు వర్తిస్తాయని వివరిస్తున్నారు. ప్రపంచమే బార్‌ అయితే ఆ బార్‌కు జపాన్‌ టెండరుదారు అన్నట్టుగా ఉంటుంది. ఫుల్లుగా తాగేయాలని అక్కడి ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. అక్కడి ప్రభుత్వం చెబుతున్నట్టుగానే నిజంగానే జపాన్‌ ప్రజలు సరిపడా మద్యం తాగడం లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

1990ల్లో ఏటా ప్రతి వ్యక్తి.. 100 లీటర్ల ఆల్కహాల్‌ను తాగుతున్నట్టు జపాన్‌ ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. సగటున స్కాచ్‌ బాటిల్‌ 750 మిల్లీ లీటర్లు ఉంటుంది. ఈ లెక్కన ఏటా జపాన్‌ పౌరుడు నెలకు 10 స్కాచ్‌ బాటిళ్లను లాంగిచేస్తాడన్నమాట. అయితే 2020 నాటికి జపాన్‌ ప్రజలు తాగించడం కొంచెం తగ్గించేశారు. ప్రతి వ్యక్తి ఏడాదికి 75 లీటర్ల చొప్పున తాగుతున్నాడన్నమాట.. అంటే.. దాదాపు 100 బాటిళ్లను ఖాళీ చేస్తున్నాడు. ఈ మాత్రం మద్యం చాలంటున్నారు జపాన్‌ ప్రజలు. అయితే ప్రభుత్వం మాత్రం ఆందోళన చెందుతోంది. కారణం ఆల్కాహాల్‌ ఆదాయం భారీగా పడిపోతోంది. 1980లో జపాన్‌ జాతీయ ఆదాయంలో 5శాతం ఆల్కాహాల్‌ నుంచే వచ్చేది. అది 2020 నాటికి 1.7 శాతానికి పడిపోయింది. దీంతో యువతను ఫుల్‌గా తాగాలని జపాన్‌ ప్రభుత్వం కోరుతోంది. అందుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. మద్యపానంపై విసృత ప్రచారం నిర్వహించాలని జపాన్‌ ప్రభుత్వం సంకల్పించింది. దేశవ్యాప్తంగా పోటీలను కూడా నిర్వహిస్తోంది. సాకే వివా పేరుతో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనే వారు మద్యపానాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన కొత్త ఐడియాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఏం చేసినా సరే యువతతో మద్యం తాగించాలని జపాన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది.

అయితే ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మన దేశంలో మద్యం బాటిల్‌పై అల్కాహాల్‌ ఆరోగ్యానికి హానికరమని చిన్నగా ముద్రించినట్టుగా జపాన్‌లోనూ ఫుల్‌గా తాగండని ప్రచారం చేసి చివర్లో అతిగా తాగితే ఆరోగ్యం పాడవుతుందని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. అయితే ఓవర్‌గా తాగొద్దని తాము ప్రచారం చేస్తున్నట్టు జపాన్‌ ఆరోగ్యశాఖ చెబుతోంది. నిజానికి మద్యం ఎక్కువ తాగొద్దని, ఆపేయాలని చెప్పాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహించడం వింతగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2000 సంవత్సరం తరువాత మద్యం విక్రయాలపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టిసారించలేదు. విధులు పూర్తి చేసుకున్నాక మద్యం సేవించడం అనేది జపాన్‌లో సంప్రదాయంగా వస్తోంది. ఈ పద్ధతిని జపాన్‌లో నోమి కై అని పిలుస్తారు. ఇందులో భాగంగా తోటి ఉద్యోగులతో పెద్ద టేబుల్‌ చుట్టూ చేరి ఒకరికొరు మద్యంను షేర్ చేసుకుని సేవిస్తారు.

సాధారణంగా పని ముగిసిన తరువాత నోమి కై పాటించకపోతే అమర్యాదగా, అవమానంగా భావిస్తారు. కానీ కాలం మారిపోయింది. ప్రస్తుతం జపాన్ ప్రజలు కుటుంబంతో గడిపేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. పని- జీవితానికి మధ్య బాలెన్స్‌ను పాటిస్తున్నారు. దీంతో విధులు ముగిసిన తరువాత పార్టీలను నిర్వహించుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. విధులు ముగిసిన తరువాత త్వరగా ఇంటికి వెళ్లిపోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మద్యపానంపైనా అవగాహన ఏర్పడింది. ఫలితంగా జపాన్‌ యువత మద్యపానంపై ఆసక్తి చూపడం లేదు. కోవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కూడా ఓ కారణంగా కూడా మద్యం విక్రయాలు భారీగా పడిపోయాయి. కేవలం బీర్ల విక్రయాలే 20 శాతం పడిపోయాయి. దీంతో జపాన్‌లో నిత్యం మత్తులో తూగేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలో ప్రపంచంలోనే ఎక్కువగా మద్యం తాగే దేశంగా జపాన్‌ ఉండేది ఇప్పుడు ఆ పేరును అక్కడి యువత తుడిచేసింది.

ప్రపంచంలోనే అత్యధికంగా ఉగాండా లిథువేనియా, లగ్జంబర్గ్‌, జర్మనీ, ఐర్లాండ్‌, లాత్వియా, స్పెయిన్‌, బల్గేరియా దేశాల్లో మద్యం తాగుతారు. అయితే ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి మద్యం సేవించాలని కోరిన దేశం జపాన్‌ ఒక్కటే కాదు బెల్జియం కూడా గతంలో ఇలానే అక్కడి ప్రజలను వింత కోరిక కోరింది. ఫ్రైలను వారానికి రెండు సార్లు తినాలని బెల్జియం ప్రజలను అక్కడి ప్రభుత్వం కోరింది. కరోనా సమయంలో 7 లక్షల 50వేల టన్నుల అలు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం వాటితో నష్టాన్ని పూడ్చుకునేందుకు అలా కోరింది.

Tags:    

Similar News