ITBP Recruitment 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఐటీబీపీ 128 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..పూర్తి వివరాలివే
ITBP Recruitment 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఐటీబీపీ 128 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..పూర్తి వివరాలివే
ITBP Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐటీబీపీ 128హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. విద్యార్హతలు, వయస్సు, ఫీజు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నాన్ గెజిటెడ్, గ్రూప్ సీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోకా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ): 09 పోస్టులు
కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) : 115 పోస్టులు
కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) : 4 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య : 128
విద్యార్హతలు :
- హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వెటర్నరీ సర్టిఫికెట్, డిప్లొమా కోర్సు చేసి ఉండాలి.
- కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్ధిష్ట ప్రమాణాలను కలిగి ఉండాలి.
వయస్సు:
-హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్ధుల వయస్సు 2024 సెప్టెంబర్ 10 నాటికి 18ఏండ్ల నుంచి 27ఏండ్ల మధ్యలో ఉండాలి.
-కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్ 10 నాటికి 18ఏండ్ల నుంచి 25ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
-జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 100చెల్లించాల్సి ఉంటుంది.
- మహిళలు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఎంపిక విధానం:
ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వ్రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
హెడ్ కానిస్టేబుల్‌కు నెలకు రూ.25,500..కానిస్టేబుల్‌కు నెలకు రూ.21,700 వేతనం అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు 2024 ఆగస్టు 30 నుంచి ప్రారంభం అవుతాయి. 2024 సెప్టెంబర్ 29 ఆన్ లైన్ కు చివరి తేదీ.