మరో ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో

Update: 2020-12-12 11:14 GMT

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అచ్చొచ్చిన వాహక నౌక PSLV- C50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 17 ను మహూర్తంగా నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలో PSLV- C50 ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి రాకెట్ ప్రయోగ పరంపరకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని సత్వరం అందుబాటులోకి తెచ్చేందకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతం అయింది. ఈనెల 17న షార్ నుంచి ప్రయోగించనున్న PSLV- C50 ప్రయోగ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. రాకెట్ అనుసంధాన పనులు వేగవంతం అయ్యాయి. ఇస్రో ఈ ప్రయోగం ద్వారా 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS 01ను నింగిలోకి చేర్చనుంది. ఇస్రో చేపట్టే పీఎస్ఎల్వీ సిరీస్‌‌లోని ఇది 52వ ప్రయోగం.

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి చేపట్టే ఈ ప్రయోగ పనులు శరవేగంగా జరుగతున్నాయి. ఇప్పటికే షార్ లోని రాకెట్ అనుసంధాన భవనంలో రాకెట్ అనుసంధాన ప్రక్రియలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3.41 గంటలకు ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

మన దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన CMS-01ను PSLV-సీ30 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. PSLV సిరీస్‌‌లోని ఇది 52వ ప్రయోగం కాగా సతీష్ ధావన స్పేస్ సెంటర్‌..షార్ నుంచి 77వ ప్రయోగం. ఇప్పటికే సేవలందిస్తున్న ఉపగ్రహాలకు ఈ ప్రయోగం అనుసంధానం చేస్తే మరింత మెరుగైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News