Satellite Images Wayanad : వయనాడ్​ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్..ఆ ఫోటోలు ఇవిగో

Satellite Images Wayanad : వయనాడ్ విలయం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ విలయాన్ని ఇస్నో శాటిలైట్స్ రికార్డ్ చేశాయి. ఈ ఫొటోలను తాజాగా ఇస్రో రిలీజ్ చేసింది. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడన ద్రుశ్యాన్ని విలయానికి ముందు తర్వాత ఫొటోలను ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోశాట్ 3, ఆర్ఐఎస్ఏటీ ఉపగ్రహాలు రికార్డు చేశాయి.

Update: 2024-08-02 03:22 GMT

Satellite Images Wayanad : వయనాడ్​ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్..ఆ ఫోటోలు ఇవిగో

Satellite Images Wayanad :ప్రకృతి సృష్టించే విపత్తును అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఆ విపత్తును ముందుగానే ఊహిస్తే కాస్త నష్టాన్ని నివారించగలము తప్పా చేసేదేమీ ఉండదు. అలాంటి అవకాశాన్ని ఇస్రో అందించింది. ఈ సంస్థ రూపొందించి ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20ఏండ్లుగా వయనాడ్ జిల్లాతోపాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించింది. దీనిలో భాగంగా తాజాగా వయనాడ్ జిల్లాలో విలయాన్ని చిత్రీకరించింది.

వయనాడ్ లో కొండచరియలు జారిపడిన ద్రుశ్యాన్ని విలయానికి ముందు విలయం తర్వాత ఫొటోలను ఆ ప్రాంతాలపై దృష్టి సారించి కార్టో శాట్ 3 ఆర్ఐఎస్ఏటీ ఉపగ్రహాలు వాటిని రికార్డు చేశాయి. ఇస్రో అనుబంధ సంస్థ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ 3డీ ఫొటోలను విశ్లేషించింది.

ఫొటోల ప్రకారం సముద్రమట్టానికి 1,550 మిటర్ల ఎత్తు నుంచి కొండచరియలు విరిగిపడగా..ఈ ప్రభావంతో 86వేల కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోయింది. ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు తెలిపారు. విలయం తర్వాత రికార్డైన 3డీ చిత్రాల్లో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్లు ఇస్రో తెలిపింది. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 80వేలకు పైగా కొండచరియలు విరిగిపడిన చిత్రాలను రికార్డు చేసింది.

2023లోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది. ఈ రిపోర్ట్స్ కేవలం కేరళలోనే కాదు..దేశంలో ఏప్రాంతంలోనై ప్రక్రుతి విపత్తును గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ గతంలో వెల్లడించిన విషయాన్ని మరోసారి ఇస్రో గుర్తు చేసింది.


Tags:    

Similar News