PSLV-C51: తొలి వాణిజ్య అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Update: 2021-02-26 06:29 GMT

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలి వాణిజ్య అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమయింది. న్యూ స్పేస్ ఇండియా ఏజెన్సీ ఈ నెల 28న శ్రీహరికోట నుండి తొలి ప్రయోగానికి సన్నద్ధమైంది. ఉదయం 10 గంటల 24 నిమిషాలకు పిఎస్‌ఎల్వీ సి-51 రాకెట్‌ ‌ద్వారా ప్రయోగం చేపట్టనుంది. ఇస్రోకి అచ్చొచ్చిన వాహకనౌక పీఎస్ఎల్వీ ద్వారా 19 ఉపగ్రహాలను రోదసీలోకి చేర్చనున్నారు శాస్త్రవేత్తలు. ప్రాథమిక ఉపగ్రహంగా బ్రెజిల్‌ ‌దేశపు అమెజోనియా ఉపగ్రహాన్ని పరీక్షించనున్నారు. మిగిలిన 18 ఉపగ్రహాల్లో ఇన్‌ ‌స్పేస్‌ ‌నుంచి 4, న్యూ స్పేస్‌ ‌నుంచి 14 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నట్లు ఇస్రో తెలిపింది.

Tags:    

Similar News