International Flight Services: నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు.. కేంద్రం ప్రకటన

International Flight Services: కరోనా పుణ్యమాని లాక్ డౌన్ ప్రారంభం నుంచి జూలై 16 వరకు నిలిచిపోయిన అంతర్జాతీయ సర్వీసులను తిరిగి పున:ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2020-07-17 05:00 GMT
Flight Services

International Flight Services: కరోనా వైరస్ పుణ్యమాని లాక్ డౌన్ ప్రారంభం నుంచి జూలై 16 వరకు నిలిచిపోయిన అంతర్జాతీయ సర్వీసులను తిరిగి పున:ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి ప్రారంభమయ్యే విమాన సర్వీసులు ముందుగా అమెరికా, ఫ్రాన్స్ బయలు దేరనున్నాయి. మరుసటి రోజు నుంచి మరో దేశానికి ఈ సర్వీసులు తిరిగేలా నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23 నుండి క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ అంత‌ర్జాతీయ విమాన సేవ‌లు రేప‌టి నుండే ప్రారంభం కాబోతున్నాయి. శుక్ర‌వారం నుండి కొన్ని దేశాల మ‌ధ్య విమాన సేవ‌లు ప్రారంభిస్తున్న‌ట్లు కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య ఒప్పందం కుదిరితేనే విమానాలు ప్రారంభించే అవ‌కాశం ఉంది. దీంతో ముందుగా అమెరికా, ఫాన్స్ దేశాల‌కు భార‌త్ నుండి విమాన స‌ర్వీసులు మొద‌లుకాబోతున్నాయి. అమెరికాకు జులై 17 నుండి నెలాఖ‌రు వ‌ర‌కు 18 స‌ర్వీసులు అందుబాటులోకి రానుండ‌గా, జులై 18 నుండి ఆగ‌స్టు 1 వ‌ర‌కు మొత్తం 28 విమాన స‌ర్వీసులు ముంబై, బెంగ‌ళూరు, ఢిల్లీ నుండి పారిస్ మ‌ధ్య న‌డుస్తాయ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

ఇంగ్లాండ్, జ‌ర్మ‌నీల మ‌ధ్య కూడా త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభం అవుతాయ‌ని, ఢిల్లీ-లండ‌న్ మ‌ధ్య రోజుకు రెండు స‌ర్వీసులు ఉండేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. జ‌ర్మ‌నీ నుండి విమానాలు న‌డ‌పాల‌ని ఇప్ప‌టికే ఆ దేశం నుండి సంప్ర‌దింపులు చేస్తున్నార‌ని ప్ర‌క‌టించారు.

గ‌తంలో విదేశాల్లో ఉన్న భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకొచ్చేందుకు భార‌త్ వందే భార‌త్ మిష‌న్ ను మొద‌లుపెట్టింది. అయితే పెయిడ్ స‌ర్వీసులు చేస్తూ… ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ఎయిర్ ఫ్లైయింగ్ ఒప్పందాల‌ను భార‌త్ ఉల్లంఘిస్తుంద‌ని అమెరికా ఆరోపించింది. ఇప్పుడు ఒప్పందం జ‌ర‌గ‌టంతో ఇరు దేశాల ఎయిర్ లైన్స్ సంస్థలు స‌ర్వీసులు మొద‌లుపెట్ట‌బోతున్నాయి. 

Tags:    

Similar News