Self-immolation Woman Died in UP: ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట నిప్పంటించుకున్న మహిళ..
Self-immolation Woman Died in UP: ఉత్తరప్రదేశ్ లో నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ భవనం, ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల తనను తాను నిప్పంటించుకున్న సోఫియా అనే మహిళ చికిత్స పొందుతూ మరణించారు
Self-immolation woman Died in UP: ఉత్తరప్రదేశ్ లో నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ భవనం, ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల తనను తాను నిప్పంటించుకున్న సోఫియా అనే మహిళ చికిత్స పొందుతూ మరణించారు. ఆమె కుమార్తె గుడియా పరిస్థితి విషమంగా ఉంది. లక్నోలో పోస్టుమార్టం తర్వాత సోఫియా మృతదేహాన్ని అమేథిలోని జామోకు పంపారు. అక్కడ భారీగా పోలీసు బలగాన్ని మోహరించారు. జూలై 17 న సోఫియా అలాగే ఆమె కుమార్తె తమను తాము నిప్పంటించుకున్నారు. సోఫియాకు 80% పైగా శరీరం కాలిపోయింది. కుమార్తెకు మాత్రం 20 శాతం గాయాలు అయ్యాయి. ఇద్దరినీ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్ నెగి ప్రకారం, సోఫియా తన శరీరంలో ఇన్ఫెక్షన్ సోకిందని.. ఈ క్రమంలో సెప్టిసిమియాతో ఆమె మరణించారని తెలిపారు.
మరోవైపు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 9 న, కాలువ వివాదంలో సోఫియా పొరుగువారితో గొడవ పడ్డారు. సోఫియా కుమార్తె గుడియా పొరుగువారి కుమారుడితో సహా నలుగురిపై వేధింపుల కేసు పెట్టింది. అయితే క్రాస్ ఎఫ్ఐఆర్ లో సోఫియా, గుడియాతో సహా ముగ్గురు వ్యక్తులపై కూడా కేసు నమోదైంది. ఈ విషయంలో తమపై పోలీసులు కేసు బనాయించడం, తల్లీకూతుళ్లను కొందరు రెచ్చగొట్టడంతో వారు మనస్థాపం చెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స పొందుతూ సోఫియా మృతిచెందారు. ఆత్మహత్యలను ప్రేరేపించిన నాయకుడితో సహా ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరికొంత మందిని శోధిస్తున్నారు.