Madhya Pradesh: ఇండోర్ మహదేవ్ మందిర్ ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Madhya Pradesh: 36కు చేరిన మృతుల సంఖ్య
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 36కి చేరింది. శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ప్రమాదంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు.