R-Value: దేశంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతరం .. ఫిబ్రవరి 6 నాటికి తారాస్థాయికి..
R-Value: దేశంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది.
R-Value: దేశంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. గత మూడు రోజులుగా కొత్త పాజిటివ్ కేసులు మూడు లక్షలకు పైగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ తీరును తెలిపే ఆర్-వాల్యూ తగ్గుముఖం పడుతుందని ఐఐటీ పరిశోధకులు వెల్లడించారు. దేశంలో కేసుల సంఖ్య ఫిబ్రవరి 6 నాటికి తారాస్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు.
జనవరి 7-13 మధ్య ఆర్-వాల్యూ 2.2గా , 1-6 తేదీల మధ్య 4గా , డిసెంబర్ 25-31 మధ్య 2.9గా ఉన్నట్లు తెలిపారు. ముంబైలో ఆర్-వాల్యూ 0.67గా, ఢిల్లీలో 0.98గా, చెన్నైలో 1.2గా, కోల్‌కతాలో 0.56గా ఉంది. ముంబై , కోల్‌కతాలో కోవిడ్ విజృంభణ ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ, చెన్నైలో మాత్రం భారీ స్థాయిలో కేసులు రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.