నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..!
Navy Jobs 2022: ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు.
Navy Jobs 2022: ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఇండియన్ నేవీ 127 సివిలియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, జీతభత్యాలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం.
మొత్తం పోస్టులు 127. ఫార్మసిస్ట్, ఫైర్ మెన్, పెస్ట్‌కంట్రోల్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు నెలకు రూ. 29,200 ఫైర్ మెన్ పోస్టులకు నెలకు రూ. 19,900 పెస్ట్‌కంట్రోల్ వర్కర్ పోస్టులకు నెలకు రూ. 18,000లు జీతంగా చెల్లిస్తారు. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వెస్టర్న్ నావెల్ కమాండ్, బాల్లాడ్ పీర్, టైగర్ గేట్, ముంబాయి 400001కి దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన 60 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. అంటే చివరితేదీ ఏప్రిల్ 25, 2022గా నిర్ణయించారు.