ITCM: భారత్ ఐటీసీఎం క్షిపణి పరీక్ష విజయవంతం
ITCM: స్వదేశీ సంకేతిక పరిజ్ఞానంతో క్రూయిజ్ మిస్సైల్ రూపకల్పన
ITCM: దేశ రక్షణ రంగ సంస్థ DRDO మరో అస్త్రానికి తుది మెరుగులు దిద్దుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్‌ను ఇండిజీనస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్- ITCMగా పిలుస్తారు. దీన్ని బెంగళూరులోని DRDOకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ రూపొందించింది. ఈ క్షిపణిని ఇవాళ ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి.. వే పాయింట్ నేవిగేషన్‌ను ఉపయోగించుకుని సముద్ర ఉపరితలంపై తక్కువ ఎత్తులో ప్రయాణించి సత్తా చాటింది. ఇందులో వినియోగించిన దేశీయ ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరు అద్భుతమని గుర్తించారు.