Corona Vaccine: వ్యాక్సిన్ పంపిణిలో రికార్డు

Corona Vaccine: దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది.

Update: 2021-04-06 11:44 GMT

Corona Vaccine: (File Image) 

Corona Vaccine: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది. దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 5న మొత్తం 43,00,966 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 39 లక్షలయితే, రెండో డోసు తీసుకున్నవారు 4 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 8.3 కోట్లు దాటినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 81 లక్షలు, గుజరాత్ లో 76 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో 71 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో 65 లక్షల మంది టీకా తీసుకున్నట్లు సమాచారం.

కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ అదుపులో వుండటం కొంత ఉపసమనం కలిగే విషయం. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా ఒక్క మరణం కూడా సంభవించలేదని, దేశవ్యాప్తంగా గత24 గంటల్లో కొత్తగా 96,982 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే కొత్త కేసుల్లో 80శాతం కేవలం 8రాష్ట్రాల్లోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది

Tags:    

Similar News