IMA: కరోనా కిట్‌లో 'కరోనిల్'…ఐఎంఏ మండిపాటు

IMA: అల్లోపతి కిట్‌లో కరోనిల్‌‌ను చేర్చడాన్ని ఎద్దేవా చేసిన ఐఎంఏ.. దీనిని 'మిక్సోపతి'గా అభివర్ణించింది.

Update: 2021-06-06 03:56 GMT

Covid Kit:(The Hans India)

IMA: అల్లోపతి మందుల గురించి యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్నే రేపుతున్నాయి. రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ డివిజన్ పరువు నష్టం నోటీసును పంపించింది. ఎవరు ఏం మాట్లాడినా నేను చేసేది చేస్తా అంటున్నారు ఈ బాబా గారు. కరోనాకు ఔషధంగా తీసుకొచ్చిన కరోనిల్‌పై తీవ్ర విమర్శలు రావడంతో పతంజలి వెనక్కి తగ్గి దానిని ఇమ్యూనిటీ బూస్టర్‌గా పేర్కొంది. హర్యానా ప్రభుత్వం కూడా కరోనా కిట్‌లో చేర్చడంపై పెద్ద దుమారం రేగుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందిస్తున్న కరోనా కిట్‌లో పతంజలి 'కరోనిల్'ను చేర్చడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి మందులు ఉండే ఈ కిట్‌లో ఆయుర్వేద మందు అయిన కరోనిల్‌‌ను చేర్చడాన్ని ఎద్దేవా చేసిన ఐఎంఏ.. దీనిని 'మిక్సోపతి'గా అభివర్ణించింది. కరోనిల్‌కు ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లేదని, కేంద్ర మార్గదర్శకాల్లోనూ ఆయుర్వేద ఔషధాలను చేర్చలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలపడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో పేర్కొందని తెలిపింది.

Tags:    

Similar News