IGNOU: ఇగ్నో యూజీ, పీజీ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్ గడువు తేదీ పొడగింపు..!
IGNOU: ఇగ్నో యూజీ, పీజీ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్ గడువు తేదీ పొడగింపు..!
IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ఆన్‌లైన్, ODL మోడ్ రెండింటికీ PG, UG ప్రోగ్రామ్‌ల తాజా అడ్మిషన్ కోసం గడువును మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఆసక్తిగల విద్యార్థులు UG, PG ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక IGNOU వెబ్‌సైట్ ignouiop.samarth.edu.in, ignouadmission.samarth.edu.in సందర్శించవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి..?
1. అధికారిక IGNOU వెబ్‌సైట్‌ను సందర్శించండి. ignouiop.samarth.edu.in, ignouadmission.samarth.edu.in, onlinerr.ignou.ac.in.
2. తాజా అడ్మిషన్ కోసం న్యూ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి. లేదా మీ రిజిస్టర్డ్ ఆధారాలతో సైన్ ఇన్ చేయండి.
3. అవసరమైన అన్ని వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలను నింపండి.
4. అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుమును చెల్లించండి.
5. ఒకె బటన్‌పై క్లిక్ చేయండి.
6. భవిష్యత్తు సూచన కోసం సేవ్ చేసి పెట్టుకోండి.
జనవరి 2022 సెషన్‌కు రిజిస్ట్రేషన్, రీ-రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీని ముందుగా మార్చి 5గా నిర్ణయించారు. అది తర్వాత మార్చి 15కి, తర్వాత మార్చి 25కి పొడిగించారు. ఇప్పుడు మళ్లీ మార్చి 31, 2022 వరకు పొడిగించారు. అయితే సెమిస్టర్ ఆధారిత, మెరిట్ ఆధారిత ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు తేదీని పొడిగించలేదు. అధికారిక నోటీసులో ఆన్‌లైన్, ODL మోడ్ రెండింటికీ సంబంధించి అన్ని PG, UG ప్రోగ్రామ్‌ల కోసం, రీ -అడ్మిషన్ కోసం గడువును పొడిగించారు.