మిషన్‌ చాణక్య ప్రజానాడి ఎలా పట్టగలుగుతుంది?

Update: 2019-10-26 09:58 GMT

ఎన్నికలు ఏవైనా... కౌంటింగ్‌ ముందు వచ్చే ఎగ్జిట్‌పోల్స్‌నే అందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలా నిర్వహించిన సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాలు కొన్ని నిజమవుతాయి మరికొన్ని తారుమారవుతాయ్. కానీ గత మూడు ఎన్నికల్లో మిషన్‌ చాణక్య సర్వే సంస్థ ఇచ్చిన ఫలితాలు నిజమవుతుండటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు మిషన్‌ చాణక్య ప్రజానాడి ఎలా పట్టగలుగుతుంది? దానికి ప్రామాణాకమేమిటి?

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై ఎవరి అంచనాలు వారికుంటాయ్‌. అందులో కొన్ని నిజమవుతుండొచ్చు. మరికొన్ని తారుమారు అవుతుండొచ్చు. కానీ మిషన్‌ చాణక్య సర్వే ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయిప్పుడు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్‌ చాణక్య విడుదల చేసిన ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు ఏమాత్రం తప్పకుండా నిజాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. మిషన్ చాణక్య టీఆర్ఎస్‌కు 78 – 86, ప్రజాకూటమికి 18 – 22, బీజేపీ 2 –6, మజ్లిస్ 6 – 8, ఇత‌రులు – 6 స్థానాలు గెలుచుకుంటాయని తన ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల చేసింది. డిసెంబరు 11వ తేదీన వచ్చిన ఫలితాల్లో సంఖ్యలు కాస్త అటు ఇటుగా వచ్చినా మిషన్‌ చాణక్య అంచనాలు మాత్రం తప్పలేదు. ఆ ఎన్నికల్లో కారు పార్టీకి 88 స్థానాలు దక్కగా ప్రజాకూటమికి 19, మజ్లిస్‌కు 7, బీజేపీ ఒక్క స్థానాన్ని దక్కించుకుంది.

ఇక ఈ ఏడాది మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమికే పట్టం కట్టింది మిషన్‌ చాణక్య. తెలంగాణలో టీఆర్ఎస్‌దే విజయమని కరెక్టుగా అంచనా వేసిన మిషన్‌ చాణక్య ఏపీలో ఎగ్జిట్‌పోల్‌ కూడా జగన్‌ పార్టీకే ఓటేసింది. అధికారంలో ఉన్న టీడీపీకి 13 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 58 రావచ్చని అంచనా వేసింది. వైసీపీకి 17 ప్లస్ ఆర్ మైనస్‌ అత్యధికంగా 98 స్థానాలొస్తాయని తెలిపింది. అంటే మెజారిటీకి మించి సీట్లు సాధిస్తుందని, ఏపీలో కాబోయే సీఎం జగన్‌ అని ముందే అంచనా వేసింది. మిషన్‌ చాణక్య ఊహించినట్టుగానే ఫలితాలు కనిపించాయి.

ఇప్పుడు తాజాగా హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన ఈ ఉపఎన్నికలో కారు పార్టీ జోరు అని మిషన్‌ చాణక్య స్పష్టమైన మెజారిటీ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి హుజూర్‌నగర్‌ ప్రజలు కారు టాప్‌ గేర్‌లో గెలిపిస్తారని అంచనా వేసింది. అదే నిజమైంది.

Full View 

Tags:    

Similar News