సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సొరెన్..అందరి దృష్టి వారిపైనే
జార్ఖండ్‌లో బీజేపీని మట్టికరిపించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది
జార్ఖండ్‌లో బీజేపీని మట్టికరిపించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయనున్నట్ల ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో అధికార పార్టీ బీజేపీ దారుణ పరాజయం ఎదురైంది. జేఎంఎం-కాంగ్రెస్ - ఆర్జేడీ కలిసి పోటీ చేశాయి. జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 విజయం సాధించాయి. అధికార బీజేపీ 25 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారంతో పాటుగా ప్రభుత్వంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల ఒక్కొక్క మంత్రి చొప్పున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి పదవులకు కీలక నేతలను ఎంపిక ఖరారైనట్లు తెలిసింది. జేఎంఎం పార్టీ నుంచి ఆరుగురికి, కాంగ్రెస్‌లో నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవితోపాటుగా మరో మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు రామేశ్వర్ ఓరాన్, అలాంగిర్ ఆలం, రాజేంద్ర ప్రసాద్ సింగ్‌లకు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని స్వయంగా కలిసి వారిని ఆహ్వానించారు హేమంత్ సోరెన్. అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. విపక్ష నేతలంతా పెద్ద ఎత్తున హాజరు కానున్నా నేపధ్యంలో అందరి దృష్టి జార్ఖండ్ వైపు మళ్లింది.