నేడు బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను

* అనంతరం, మధ్య బంగాళాఖాతంలో తుఫాను బలహీనపడే అవకాశం

Update: 2023-05-11 04:36 GMT

నేడు బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను

Bay of Bengal: వాతావరణ శాఖ అంచనా ప్రకారం తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడిన అనంతరం తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని తెలిపింది.ఈ రోజు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 12వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా మారొచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో తుఫాను దిశను మార్చుకుని బలహీనపడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్టు అంచనా వేసింది. తుఫాను అనంతరం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగి 40 డిగ్రీల మార్కును చేరతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Tags:    

Similar News