జమ్ముకశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు.. మరింత అందాలను పులుముకున్న భూతల స్వర్గం
Jammu and Kashmir: హిమపాతంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను సంతరించుకుంది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం రాత్రి నుంచి నిరాటంకంగా మంచు కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హిమం గుట్టలుగా పేరుకుపోయింది.
దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. మంచుధాటికి జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎటు చూసినా మంచు కుప్పలే కనిపిస్తున్నాయి. చెట్లు, ఇళ్లు, రోడ్లు, వాహనాలను మంచు కప్పేసింది.