Snowfall: జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లో మంచు వర్షం.. రోడ్లు,కొండలు, చెట్లపై పేరుకుపోయిన మంచు
Snowfall: మొఘల్ రోడ్డును మూసివేసిన అధికారులు
Snowfall: జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా మంచు వర్షం కురుస్తోంది. పూంచ్‌లో భారీగా కురుస్తున్న మంచుతో కొండలన్నీ తెల్లగా మారిపోయాయి. రోడ్లపై మంచు పేరుకు పోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పాడింది.. చాలా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మొఘల్ రోడ్డును మూసివేశారు. శ్రీనగర్-లేహ్ నేషనల్ హైవేపై పేరుకుపోయిన మంచును తొలగింంచేందుకు ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు.
రుద్రప్రయాగ్‌లో కొండలు.. చెట్లు మంచు దుప్పటిని తలపిస్తున్నాయి. కేదార్‌నాథ్ ఆలయ దర్శనానికి వెళ్తున్న భక్తులు మంచుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చేసిన సోలార్ పవర్ ప్లేట్లపై మంచు పేరుకుపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడకుండా జవాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు.